Exams...
How to do paper presentation...
ప్రజెంటేషన్ కీలకం.....
పరీక్షలో ప్రజెంటేషన్ ప్రిపరేషన్ హార్డ్ వర్క్ దీనితోనే ముడిపడి ఉంటాయి. ఎంత బాగా వచ్చిన అంశమైనా దానిని చక్కగా అర్ధమయ్యేలా రాస్తే నే మంచి మార్కులు వస్తాయి .ముందు ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి . వచ్చింది కదా అని ఒకే ప్రశ్నకు పెద్ద జవాబులు రాసి టైమ్ వృధా కాకుండా చూసుకోవాలి. ఎన్ని మార్కుల ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలనేది ముందుగానే ఇంటిదగ్గర అంచనాకు రావాలి .గతప్రశ్న పత్రాలను పరిశీలించి ఏ ప్రశ్నకు ఏ మేరకు జవాబు ఎంత నిడివితో రాయాలో నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం సమయాన్ని విభజించుకుని రాయాలి. జవాబులను తప్పులు, కొట్టివేతలు లేకుండా గుండ్రటి చేతిరాతతో రాయాలి . లెక్కలకు రఫ్ వర్క్ కి కేటాయించిన ప్రదేశంలోనే చేసి కేటాయించిన ప్రదేశంలోనే చేసి, నిర్దేశించిన ప్రాంతంలో నీట్ గా చేయాలి. పరీక్షలకు ముందు కళాశాలలో నిర్వహించే ప్రీ-ఫైనల్ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి .ప్రశ్నల తీరు ,సమయ విభజన ,ప్రజెంటేషన్ పై ఒక అవగాహన వచ్చేలా చేస్తాయి .
EXAM FEVER????
Balanced diet is must..
పోషకాహారం వేళకు నిద్ర తప్పనిసరి...
పరీక్షలంటే భయం తో చాలా మంది పిల్లలు ఆహారం నిద్ర మానేస్తుంటారు .కానీ అది అసలు చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. బయట నుంచి తెచ్చే ఆహరపదార్ధాలు, మసాలా వంటకాలు తగ్గించాలి .పోషకాహారాన్ని మితంగా వేల మించకుండా తీసుకుంటూ ఉండాలి అని సూచిస్తున్నారు .ఆయిల్ ,జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు. మధ్యాహ్న భోజనంలో పప్పు దినుసులు, ఆకుకూరలు ఉండేలా చూడాలి . పానీపూరీ, చాట్ వంటి పదార్థాలను దూరం పెట్టి పుచ్చకాయ ,ఆపిల్ వంటి పండ్లు తీసుకోవాలి .రాత్రి భోజనం మితంగా ఉండాలి . పడుకొనే ముందు తప్పనిసరిగా పాలు తాగాలి. మంచి నిద్ర వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలుసుకోవాలి.పరీక్ష ముందు రోజు అర్ధరాత్రి వరకు చదవటం ఏమాత్రం మంచిది కాదు. కనీసం 6-7 గంటలు నిద్ర అవసరం .రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఉదయం 4 గంటలకు లేచి చదివితే బాగా గుర్తుంటుంది.